నాకు ఇదేం ప‌రిస్థితిరా అయ్యా...!



40 సంవ‌త్స‌రాల రాజ‌కీయ ఇండ‌స్ట్రీ.. 14 ఏళ్ల సీఎం, దేశానికి ప్ర‌ధానిని నిర్ణ‌యించే స్థాయి నాది అని చెప్పుకునే చంద్రబాబుకి ఇదేం ప‌రిస్థితి ప‌ట్టింది. ఈయ‌న మాట‌లు చూస్తే ఎన్నో వేల కోట‌లు దాటిపోతాయి. కానీ త‌న సొంతూరికి కేవ‌లం ఒక బ‌స్టాండు కూడా క‌ట్టించ‌లేక‌పోయారు. మ‌రి ఎందుకో క‌ట్టింలేక‌నా... లేక‌పోతే ఎందుకు క‌ట్టించ‌డం అని అనుకున్నారా..?


అంత బ‌తుకు బ‌తికి ఇంటెనుక స‌చ్చిన‌ట్టుంది ఇప్పుడు బాబు గారి ప‌రిస్థితి. ఆయ‌న కోట‌కు క‌న్నంప‌డే రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయ‌ని ఆఖ‌రికి కుప్పం ప్ర‌జ‌లు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇన్ని చేస్త‌న్నా.. త‌న సొంత పుత్రుడిని ఇప్ప‌టి వ‌ర‌కు ఎమ్మెల్యేని కూడా చేయ‌లేపోయాడు కానీ... ఏకంగా సీఎంని చేయాల‌ని చూస్తున్నాడంట‌... అప్పుడు త‌న మిత్రుడు అచ్చెనే చెప్పాడుగా.. !


చివ‌రికి ఎన్ని అక్ర‌మ సంబంధాలు (అదేనండి ఇత‌ర పార్టీల‌తో పొత్తు అంటున్నా) చివ‌రికి కుప్పంలో ఒక కుర్రాడి చేతిలో ఓట‌మిని చ‌విచూడ‌టానికి సిద్ధంగా ఉన్నారు మ‌న పెద్ద బాబు.. ఇక చిన్న బాబు అయితే.. ఇంకా ఎమ్మెల్యే కూడా కాలేదు.. అప్పుడే.. త‌ను సీఎం అయిన‌ట్లుగా.. రెడ్ బుక్ అని చెప్పుకుంటూ పోతున్నాడు. నువ్వు అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత చేస్తానంటున్న‌ది.. వైసీపీ వాళ్లు అధికారం లేక‌పోయినా చేస్తామ‌ని చెబుతున్నారు.  

ఇక దీని కోసం మ‌నం జూన్ 4వ తేదీ వ‌ర‌కు వేచి చూడాల్సిందే...  

Comments